¶ ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహ పరిచే నివేదిక ఇచ్చారు. “మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు.
TSK
TSK · ద్వితీ 7:17
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.
¶ ‘ఏదైనా ఒక సందేశం యెహోవా చెప్పింది కాదని మేమెలా తెలుసుకోగలం?’ అని మీరనుకుంటే,
మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ రాజ్యాలన్నిటికీ చేసినదంతా మీరు చూశారు. మీ తరఫున యుద్ధం చేసింది మీ దేవుడు యెహోవాయే!
కాబట్టి సుఖాసక్తితో నిర్భయంగా జీవిస్తూ “నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు. నేనెన్నటికీ విధవరాలిని కాను, పుత్రశోకం నాకు కలగదు” అనుకుంటున్నావు. ఇదిగో, ఈ మాటను విను.
“ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయి?” అని నీ మనస్సులో అనుకోవచ్చు. నువ్వు చేసిన విస్తారమైన దోషాలే దానికి కారణం. అందుకే నీ వస్త్రాలు తీసివేయడం, నీపై అత్యాచారం చేయడం జరుగుతుంది.