TSK

TSK · ద్వితీ 9:7

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

అప్పుడు వాళ్ళు మోషేతో “ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా?

దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ “మాకు తాగడానికి నీళ్లియ్యి” అన్నారు. అప్పుడు మోషే “మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?” అన్నాడు.

¶ ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు.

¶ ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు.

ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు.

¶ మీ తిరుగుబాటుతత్వం, మీ తలబిరుసుతనం నాకు తెలుసు. ఇవ్వాళ నేను ఇంకా జీవించి మీతో కలిసి ఉండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు.

¶ అయితే వారూ మా పూర్వికులూ గర్వంతో, నీ ఆజ్ఞలకు లోబడకుండా వాటిని పెడచెవిన పెట్టారు.

అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు.

¶ మీ పితరులు చేసిన దుర్మార్గాన్నీ, మీ యూదా రాజులూ, వాళ్ళ భార్యలూ చేసిన దుర్మార్గాన్నీ మరచిపోయారా? యూదా దేశంలోనూ, యెరూషలేము వీధుల్లోనూ మీరూ, మీ భార్యలూ చేసిన దుర్మార్గాన్ని మరచిపోయారా?

¶ అయితే ఎడారిలో ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడలు అనుసరించకుండా, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు, ఎడారిలో నా ఉగ్రత నేను వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళను నాశనం చేద్దామనుకున్నాను.

అప్పుడు మీరు మీ చెడ్డ ప్రవర్తననూ మీ చెడ్డ పనులనూ గుర్తుకు తెచ్చుకుని మీ అసహ్య కార్యాలు బట్టి, మీ సొంత పాపాల బట్టి, మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.

¶ కాబట్టి పూర్వం మీరు శారీరికంగా అన్యులు. “శరీరంలో మనుషుల చేతితో సున్నతి పొందిన యూదులు” మిమ్మల్ని “సున్నతి లేనివారు” అని పిలిచేవారు.