TSK

TSK · ప్రసంగి 10:13

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ ఏడవ రోజున వాళ్ళు సంసోను భార్యతో “మమ్మల్ని నిరుపేదలుగా చేయడానికే ఆహ్వానించారా? ఎలాగైనా నీ భర్త దగ్గర ఈ పొడుపు కథ భావాన్ని రాబట్టి మాకు చెప్పు. లేకపోతే నిన్నూ నీ తండ్రి ఇంటి వాళ్ళనూ తగలబెట్టేస్తాం” అన్నారు.

¶ సౌలు తన చుట్టూ నిలబడి ఉన్న సేవకులతో ఇలా అన్నాడు “బెన్యామీనీయులారా, వినండి. యెష్షయి కొడుకు మీకు పొలాలు, ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వందమంది, వెయ్యిమంది సైనికులపై అధిపతులుగా చేస్తాడా?

దావీదు సేవకులతో నాబాలు “దావీదు ఎవడు? యెష్షయి కొడుకెవడు? ఈ రోజుల్లో తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు చాలా మంది ఉన్నారు.

¶ అది విని రాజు “యెహోవాయే నీకు సహాయం చెయ్యడం లేదు. ఇక నేనేం చేస్తాను. ద్రాక్ష గానుగ నుండీ, ధాన్యపు కళ్ళం నుండీ ఏమన్నా వస్తుందా” అన్నాడు.

¶ వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు.

దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడానికి త్వరపడక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.

¶ ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.

¶ అప్పుడు వారు వెర్రి కోపంతో నిండి పోయి యేసును ఏమి చేయాలా అని తమలో తాము చర్చించుకున్నారు.

¶ ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయిన తరువాత ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయన మీద పగ పట్టి ఆయన మీద నేరం మోపడానికై ఆయన మాటల్లో తప్పు పట్టుకోడానికి చూస్తూ ఆయనతో వాదిస్తూ వచ్చారు.

ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు.