TSK

TSK · ప్రసంగి 4:14

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.

ఫరో “చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను” అని యోసేపుతో చెప్పాడు.

దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

¶ యెహోయాహాజు పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 23 సంవత్సరాలు. అతడు యెరూషలేములో మూడు నెలలు ఏలాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా ఊరి వాడు యిర్మీయా కూతురు.

యెహోయాకీము తన పూర్వీకులతోబాటు చనిపోగా అతని కొడుకు యెహోయాకీను అతని స్థానంలో రాజయ్యాడు.

సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి, సిద్కియా కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు.

ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు.

¶ మా నాసికారంధ్రాల ఊపిరి, యెహోవా చేత అభిషేకం పొందిన మా రాజు, వాళ్ళు తవ్విన గుంటల్లో పడి దొరికిపోయాడు.