¶ కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు.
TSK
TSK · నిర్గమ 32:5
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
అతడు వాటిని తీసుకుని దూడ రూపం అచ్చుతో పోత పోసి బంగారం దూడను తయారు చేయించాడు. అప్పుడు ప్రజలు “ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే” అని కేకలు వేశారు.
ఇవి యెహోవా నియామక కాలాలు. వాటిని బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘ దినాలు ఇవి.
¶ ఇవి యెహోవా నియామక పండగలు. ఆయనకు హోమ బలులు, దహన బలులు, నైవేద్యాలు, పానీయార్పణలు అర్పించడానికి పరిశుద్ధ సంఘ దినాలుగా మీరు చాటించవలసిన రోజులు ఇవే. ఏ అర్పణ రోజున ఆ అర్పణ తేవాలి.
¶ యరొబాము యూదా దేశంలో జరిగే మహోత్సవం లాంటి ఉత్సవాన్ని ఎనిమిదవ నెల పదిహేనవ రోజున జరపడానికి నిర్ణయించి, బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా బేతేలులో కూడా తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తూ వచ్చాడు. తాను చేయించిన ఉన్నత స్థలాలకు యాజకులను బేతేలులో ఉంచాడు.
ఇంకా యెహూ “బయలు దేవుడికి ఒక ప్రత్యేకమైన పండగ జరుగబోతున్నదని ప్రకటించండి” అన్నాడు. అతని సేవకులు ఆ విధంగానే ప్రకటించారు.
చాలా కాలం నుంచి లేఖనంలో రాసినట్టు ఎక్కువమంది ప్రజలు పండగ ఆచరించ లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించడానికి రావాలని బెయేర్షెబా నుంచి దాను వరకూ ఇశ్రాయేలు దేశమంతా చాటించాలని వారు నిర్ణయించారు.
¶ ఇశ్రాయేలువారు తమ సృష్టికర్త అయిన దేవుని మర్చి పోయారు. తమ కోసం భవనాలు కట్టించుకున్నారు. యూదావారు, చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. అయితే నేను వారి పట్టణాలను తగలబెడతాను. వారి కోటలను ధ్వంసం చేస్తాను.