All books in తెలుగు IRV

నిర్గమ 37

తెలుగు IRV · chapter 37

40 అధ్యాయాలు

తెలుగు IRV / నిర్గమ / అధ్యాయం 37

తెలుగు IRV · chapter 37

1 ¶ బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని తయారుచేశాడు. దాని పొడవు రెండు మూరలు, దాని వెడల్పు, ఎత్తు మూరన్నర,

2 దాని లోపల, బయటా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాడు. దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.

3 ¶ దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు చేసి, ఒక పక్క రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు.

4 ¶ అతడు తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.

5 ¶ మందసాన్ని మోయడానికి వీలుగా దాని చుట్టూ ఉన్న గుండ్రని కమ్మీలలో ఆ మోసే కర్రలు ఉంచాడు.

6 ¶ అతడు స్వచ్ఛమైన బంగారంతో కరుణా స్థానం మూత చేశాడు. దాని పొడవు, వెడల్పు మూరన్నర.

7 ¶ బంగారంతో రెండు కెరూబు ఆకారాలను చేశాడు. కరుణా స్థానం రెండు అంచులను బంగారు రేకులతో అలంకరించాడు.

8 ¶ రెండు కొనలకు రెండు కెరూబు ఆకారాలను జత చేసి, అవి కరుణా స్థానం మూతకు ఏకాండంగా నిలిచేలా చేశాడు.

9 ¶ ఆ రెండు కెరూబులు పైకి రెక్కలు విప్పి, కరుణా స్థానాన్ని వాటి రెక్కలతో కప్పాయి. కెరూబుల ముఖాలు కరుణా స్థానాన్ని కప్పుతూ ఒక దానికొకటి ఎదురెదురుగా నిలిచాయి.

10 ¶ అతడు తుమ్మకర్రతో బల్ల తయారు చేశాడు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు మూరన్నర.

11 ¶ అతడు దాని పైన స్వచ్ఛమైన బంగారంతో రేకు పొదిగించి, దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.

12 ¶ దాని చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు రేకు అమర్చాడు.

13 ¶ బల్ల కోసం బంగారంతో నాలుగు గుండ్రని కమ్మీలు పోతపోసి బల్ల నాలుగు కాళ్ళ మూలలకు వాటిని బిగించాడు.

14 ¶ బల్లను మోసేందుకు వీలుగా గుండ్రని కమ్మీలు దాని బద్దెకు దగ్గరగా ఉన్నాయి.

15 ¶ బల్లను మోసే కర్రలను తుమ్మకర్రతో చేయించి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.

16 ¶ బల్లమీద ఉండే సామగ్రి, అంటే దాని పాత్రలు, ధూపం వేసే కలశాలు, గిన్నెలు, పానీయ అర్పణకు పాత్రలు స్వచ్ఛమైన బంగారంతో చేశాడు.

17 ¶ అతడు దీప స్తంభాన్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు. దాన్నీ, దాని అడుగు భాగాన్నీ, నిలువు భాగాన్నీ బంగారు రేకుతో అలంకరించాడు. దాని కలశాలు, మొగ్గలు, పువ్వులు ఏకాండంగా చేశాడు.

18 ¶ దీపవృక్షం రెండు వైపుల నుండి మూడేసి కొమ్మల చొప్పున ఆరు కొమ్మలు బయలుదేరాయి.

19 ¶ దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఒక్కో కొమ్మకు బాదం ఆకారంలో పువ్వులు, మొగ్గలు ఉన్నాయి. ఆ విధంగా దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఉన్నాయి.

20 ¶ దీపవృక్షంలో బాదం రూపంలో మొగ్గలు, పువ్వులు ఉన్న నాలుగు కలశాలు ఉన్నాయి.

21 ¶ దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల కింద ఒక్కో పువ్వు మొగ్గ ఏకాండంగా ఉన్నాయి.

22 ¶ వాటి మొగ్గలు, కొమ్మలు ఏకాండంగా ఉన్నాయి. ఏకాండంగా ఉన్న అవన్నీ స్వచ్ఛమైన బంగారంతో అలంకరించాడు.

23 ¶ దానికి ఏడు దీపాలు, దాని కత్తెరలు, కత్తెర చిప్పలు, దాని పట్టుకారులు మేలిమి బంగారంతో చేశాడు.

24 ¶ దీపవృక్షం, దాని సామగ్రి అంతటినీ 35 కిలోల మేలిమి బంగారంతో చేశాడు.

25 ¶ అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాడు. దాని పొడవు, వెడల్పు ఒక మూర. అది చదరంగా ఉంది. దాని ఎత్తు రెండు మూరలు, దాని కొమ్ములు మలుపులు లేకుండా ఏకాండంగా ఉన్నాయి.

26 ¶ దాని కప్పుకు, నాలుగు పక్కలకు, దాని కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకులు పొదిగించి దానికి పై అంచు చుట్టూ బంగారం అలంకరించాడు.

27 ¶ ఆ అలంకారం కింద వేదికకు రెండు గుండ్రని బంగారపు కమ్మీలను చేసి దాని రెండు పక్కలా రెండు మూలల్లో బంగారం అలంకారం చేశాడు.

28 ¶ దాన్ని మోసే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం రేకులు తొడిగించాడు.

29 ¶ పవిత్ర అభిషేక తైలాన్నీ, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యాన్ని నిపుణుడైన పనివాడితో చేయించాడు.