TSK

TSK · నిర్గమ 6:26

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.”

¶ అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి” అని ఆజ్ఞాపించాడు.

అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను.

ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి.

అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు.

¶ మోషే కొండ దిగి రావడం ఆలస్యం కావడం చూసిన ప్రజలు అహరోను దగ్గరికి వచ్చారు. “లే, మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి మా కోసం ఒక దేవుణ్ణి సిద్ధం చెయ్యి. ఐగుప్తు నుండి మమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన మోషే అనే వాడు ఏమయ్యాడో మాకు తెలియడం లేదు” అన్నారు.

అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమిలాడాడు. “యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళను బయటకు రప్పించావు కదా.

¶ తరువాత నేను మోషే అహరోనులను పంపి, ఐగుప్తీయులను తెగుళ్ళతో బాధపెట్టి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను.

¶ యాకోబు ఐగుప్తుకు వచ్చిన తరువాత మీ పూర్వికులు యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన మోషే అహరోనులను పంపించి వారిని ఐగుప్తు నుండి నడిపించి వారు వచ్చి ఈ ప్రాంతంలో నివసించేలా చేశాడు.

మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.

ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను.