దావీదు ఆ పట్టణంలో కాపురం ఉన్నాడు. దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. మిల్లో దిగువన దావీదు ఒక కోట కట్టించాడు.
TSK
TSK · యెహెజ్కేలు 21:20
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మం దగ్గర, లోయ గుమ్మం దగ్గర, ప్రాకారపు మూల దగ్గర, బురుజులు కట్టించి వాటి చుట్టూ ప్రాకారాలు ఏర్పరచాడు.
¶ దీని తరువాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమరగా, లోయలో చేప గుమ్మం వరకూ ఓపెలు చుట్టూ చాలా ఎత్తయిన గోడ కట్టించాడు. యూదా దేశంలోని బలమైన పట్టణాలన్నిటిలో సేనాధిపతులను ఉంచాడు.
యెహోవా మీద నమ్మకం ఉంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా నిశ్చలంగా శాశ్వతంగా నిలిచి ఉంటారు.
అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “రబ్బాకు వ్యతిరేకంగానూ, అమ్మోను ప్రజలకు వ్యతిరేకంగానూ నేను యుద్ధ భేరీని మోగించే రోజులు వస్తున్నాయి. దాంతో రబ్బా అంతా వదిలివేసిన గుట్టలా ఉంటుంది. దాని ఊళ్ళు తగలబడి పోతాయి. దాని వారసులను ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకుంటారు.
నేను రబ్బా పట్టణాన్ని ఒంటెల శాలగా చేస్తాను, అమ్మోనీయుల దేశాన్ని గొర్రెల దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.