TSK

TSK · యెహెజ్కేలు 32:21

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి.

¶ కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి సత్య సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది.

నువ్వు ప్రవేశిస్తూ ఉండగానే నిన్ను ఎదుర్కోడానికి పాతాళం నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అది నీ కోసం చనిపోయిన వాళ్ళను లేపుతోంది. భూరాజులందరినీ, జనాల రాజులందరినీ వాళ్ళ సింహాసనాల మీద నుంచి లేపుతోంది.

వాళ్ళతో ఇలా అను, ‘మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో’

వీళ్ళు సున్నతి లేని వాళ్ళలో పడిపోయిన శూరుల దగ్గర పడుకోరు. వాళ్ళు తమ యుద్ధాయుధాలన్నిటితో పాతాళంలోకి దిగిపోయి, తమ కత్తులను తమ తలల కింద ఉంచుకుని పడుకుంటారు. తమ డాళ్ళను తమతో ఉంచుకుంటారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు.