TSK

TSK · ఎజ్రా 10:1

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషాన్ని, తమ తండ్రుల దోషాన్ని ఒప్పుకుని, తాము నాకు విరోధంగా నడిచామని,

¶ యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. అతడూ ఇశ్రాయేలీయుల పెద్దలూ సాయంకాలం వరకూ యెహోవా మందసం ముందు నేలమీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకొంటూ

¶ యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పినప్పుడు

¶ యెహోవా అతనితో ఇలా అన్నాడు. “నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపాలను నేను విన్నాను. నా నామం అక్కడ ఎప్పటికీ నిలిచి ఉండాలని నీవు కట్టించిన ఈ మందిరాన్ని నేను పవిత్ర పరిచాను. నా కళ్ళు, నా మనసు, ఎప్పటికీ దానివైపు ఉంటాయి.

యూదావారంతా తమ పసికందులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.

దేవుని సేవకుడైన మోషే నియమించిన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొంటూ, ప్రభువైన యెహోవా నిబంధనలు, కట్టడలు ఆచరిస్తామని శపథం చేసి ఒట్టు పెట్టుకోవడానికి సమకూడారు.

ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను.

ఇప్పుడు మీరు ఆ మాట వినకపోతే మీ గర్వం విషయంలో నేను రహస్యంగా విలపిస్తాను. యెహోవా మందను చెరగా పట్టుకున్నందుకు నేను కన్నీరు మున్నీరుగా విలపిస్తాను.

¶ నేను ఇంకా పలుకుతూ ప్రార్థనచేస్తూ, పవిత్ర పర్వతం కోసం నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపాన్ని నా ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ నా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను.

ప్రజలను సమకూర్చండి. సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.

¶ ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు.

ఆ రోజులు గడిచిన తరువాత మేము ప్రయాణమైనప్పుడు వారంతా భార్యా పిల్లలతో వచ్చి మమ్మల్ని పట్టణం బయటి వరకూ సాగనంపారు. వారూ, మేమూ సముద్రతీరంలో మోకాళ్ళపై ప్రార్థించి ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకున్నాం.

¶ మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.