TSK

TSK · ఎజ్రా 5:14

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

దేవుని మందిరం లోని వస్తువులన్నిటినీ పెద్దవీ, చిన్నవీ, యెహోవా మందిరం నిధులూ, రాజు నిధులూ, రాజు అధికారుల నిధులన్నిటినీ అతడు బబులోనుకు తీసుకు పోయాడు.

¶ కాబట్టి షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోని దేవుని మందిరం పునాది వేయించాడు. అప్పటినుండి నేటివరకూ దాన్ని కడుతూ ఉన్నాము. పని ఇంకా పూర్తి కాలేదు.

¶ యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి ఘనత కలిగేలా చేయడానికి రాజుకు అలాంటి ఆలోచన పుట్టించినందుకు మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగు గాక. రాజు, అతని మంత్రులు, ఆస్థాన అధిపతులు నాపై దయ చూపేలా దేవుడు అనుగ్రహించాడు.

పళ్ళేలనూ, ధూపం వేసే పళ్ళేలనూ పాత్రలనూ కుండలనూ దీప స్తంభాలనూ ఇంకా బంగారు పళ్ళేలనూ వెండి పళ్ళేలనూ రాజు అంగరక్షకుల అధిపతి తీసుకువెళ్ళాడు.

¶ రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినాన ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారి, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుకు, ప్రధానయాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు.

¶ “నీవు యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువతోను శేషించిన జనులతోను ఇలా చెప్పు.

ఇతడు వివేకి అయిన సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్కు వినాలని బర్నబానూ సౌలునూ పిలిపించాడు.