TSK

TSK · ఎజ్రా 7:12

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ సిరియా రాజు బెన్హదదు తన సైన్యాన్నంతా సిద్ధం చేశాడు. అతనితో ఉన్న ముప్ఫై ఇద్దరు రాజులతో గుర్రాలతో రథాలతో బయలుదేరి సమరయను ముట్టడించి దాని మీద యుద్ధం చేశాడు.

గతంలో ఘనత వహించిన అషుర్ బనిపాల్ షోమ్రోను పట్టణంలో నది ఇవతల వైపున ఉంచిన మిగిలిన ప్రజలు రాస్తున్న విషయాలు.”

అతను “నా అధిపతులందరూ మహారాజులు కారా?

రాజా, పరలోకంలో ఉన్న దేవుడు రాజ్యాన్నీ, అధికారాన్నీ, బలప్రభావాలనూ ఘనతనూ మీకు అనుగ్రహించాడు. మీరు రాజులకు రాజుగా ప్రఖ్యాతి గాంచారు.

¶ భాగ్యవంతుడు, ఎకైక శక్తిశాలి అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.

ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది.