TSK

TSK · ఆది 28:20

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

నీవెక్కడ స్తంభం మీద నూనె పోశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో, ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు’ అని నాతో చెప్పాడు” అన్నాడు.

¶ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.

అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మొక్కు కున్నాడు “నువ్వు నాకు అమ్మోనీయుల మీద జయం కచ్చితంగా ఇస్తే,

కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు సమర్పిస్తున్నాను. అతడు జీవించే కాలమంతటిలో వాడు యెహోవాకు ప్రతిష్ట అయిన వాడు” అని చెప్పింది. ఎల్కానా, అతని కుటుంబం అక్కడే యెహోవాను ఆరాధించారు.

నేను హెబ్రోనుకు వెళ్ళి యెహోవాకు నేను మొక్కుబడి తీర్చుకొనడానికి నాకు అనుమతి ఇవ్వు” అని అడిగాడు.

¶ అదే నెల 24 వ తేదీన ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలల మీద దుమ్ము పోసుకుని సమావేశమయ్యారు.

దేవా, నువ్వు చావునుండి నా ప్రాణాన్ని తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు.

ప్రతి రోజూ నా మొక్కుబడులు నేను చెల్లించేలా నీ నామాన్ని నిత్యం కీర్తిస్తాను.

మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి.

ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను.

అతడు ఏ విధంగా యెహోవాకు ప్రమాణం చేశాడో, పరాక్రమశాలి అయిన యాకోబు దేవుడికి ఏమి వాగ్దానం చేశాడో మనసుకు తెచ్చుకో.

ఐగుప్తు ప్రజలకు యెహోవా తనను తెలియపరచుకుంటాడు. ఆ రోజున ఐగుప్తు ప్రజలు యెహోవాను తెలుసుకుంటారు. వాళ్ళు ఆయనను బలులతో, కానుకలతో ఆరాధిస్తారు. యెహోవాకు మొక్కుకుని ఆ మొక్కుబళ్ళు చెల్లిస్తారు.

¶ పౌలు ఇంకా చాలా రోజులు అక్కడే ఉండి చివరికి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. కెంక్రేయ ఓడరేవులో తన నాజీరు వ్రత సంబంధమైన జుట్టు కత్తిరించుకుని ప్రిస్కిల్ల, అకులతో కలిసి సిరియాకు బయలుదేరాడు.