ఆది 30:7
TSK
రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
TSK
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు.
¶ నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం.
దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
¶ నఫ్తాలీయుల్లో వెయ్యిమంది అధిపతులూ, వాళ్లతోపాటు డాలు, ఈటె పట్టుకొన్నవాళ్ళు ముప్ఫై ఏడువేలమంది.