నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి.
TSK
TSK · హెబ్రీ పత్రిక 10:33
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
దేవా, లేచి నీ ఘనతను కాపాడుకో. బుద్ధిహీనులు రోజంతా నిన్ను దూషిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో.
యెహోవా, నీ శత్రువులు నిందలు మోపుతున్నారు, నీ అభిషిక్తుని అడుగులపై వాళ్ళు నిందలు మోపుతున్నారు.
నీ ముఖంపై పెంట విసిరి చూసేవారు నిన్ను ఏవగించుకునేలా చేస్తాను.
¶ దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో చివరి వరసలో ఉంచి మరణశిక్ష పొందిన వారిలా ఉంచాడని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాం.
¶ మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు.
ఎలాగంటే సోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసులో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకుంటున్నారు. వారు యూదుల వలన అనుభవించిన హింసలే ఇప్పుడు మీరు కూడా మీ స్వదేశీయుల వలన అనుభవిస్తున్నారు.
ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక.
¶ ఇంకా కొందరు వెక్కిరింతలనూ, కొరడా దెబ్బలనూ సహించారు. నిజమే, సంకెళ్లనూ ఖైదునూ సైతం సహించారు.