TSK

TSK · హోషేయ 1:4

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను,

¶ అహాబుకి షోమ్రోనులో డెబ్భై మంది సంతానం ఉన్నారు. యెహూ షోమ్రోనులో ఉన్న యెజ్రెయేలు అధిపతులకూ, అక్కడి పెద్దలకూ, అహాబు సంతానం సంరక్షకులకూ ఉత్తరాలు రాసి పంపాడు.

తన సేవకుడు ఏలీయా ద్వారా యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటలను ఆయన నెరవేర్చాడు. యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటల్లో ఏ ఒక్కటీ వ్యర్థంగా పోదని మీరు తెలుసుకోవాలి.”

అతడు షోమ్రోను చేరుకుని అక్కడ అహాబుకు చెందిన మిగిలిన రాజవంశీకులందర్నీ చంపివేశాడు. యెహోవా ఏలీయాకు చెప్పిన మాట నెరవేర్చాడు.

¶ యాబేషు కొడుకు షల్లూము అతని మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.

హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే చోటా, మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు.

¶ కానీ వాళ్ళు తమ పూర్వీకుల దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుడు తమ కళ్ళెదుట ఏ జాతులనైతే నాశనం చేశాడో ఆ జాతుల దేవుళ్ళను పూజించారు.

¶ అప్పుడు నేను స్త్రీ ప్రవక్త దగ్గరికి పోయాను. ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. యెహోవా “వాడికి ‘మహేర్ షాలాల్‌ హాష్‌ బజ్‌’ అనే పేరు పెట్టు.

ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.

వాళ్ళు దాని వస్త్రాలు తీసేసి నగ్నంగా చేశారు. దాని కొడుకులను, కూతుళ్ళను పట్టుకుని, దాన్ని కత్తితో చంపారు. ఆ విధంగా ఆమె ఇతర స్త్రీలకు అవమానంగా అయ్యింది. కాబట్టి ఇతర స్త్రీలు దాని మీద వాళ్ళ తీర్పు చెప్పారు.

¶ గోమెరు మళ్లీ గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. యెహోవా అతనికి ఇలా చెప్పాడు. “దీనికి ‘లో రూహామా’ అని పేరు పెట్టు. ఎందుకంటే ఇకపై నేను ఇశ్రాయేలును క్షమించడం కోసం వారిపై జాలి పడను.

¶ అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను. ఆ దేవుళ్ళకు ధూపం వేసినందుకు. నగలు పెట్టుకుని, సింగారించుకుని. నన్ను మర్చిపోయి దాని విటులను వెంటాడినందుకు దాన్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.

¶ వారు నా దేవుని మాట వినలేదు గనక ఆయన వారిని విసర్జించాడు. వారు దేశం విడిచి అన్యజనుల్లో దేశదిమ్మరులౌతారు.

ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.

ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.

యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, ‹“నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు”› అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం).