నేను ఐగుప్తులోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసించేలా చేసానని మీ ప్రజలకు తెలిసేలా ఏడు రోజులు మీరు పర్ణశాలల్లో నివసించాలి. ఇశ్రాయేలీయుల్లో పుట్టిన వారంతా పర్ణశాలల్లో నివసించాలి.
TSK
TSK · హోషేయ 12:10
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ ఒక దైవ సేవకుడు యెహోవా మాట చొప్పున యూదాదేశం నుండి బేతేలుకు వచ్చాడు. ధూపం వేయడానికి యరొబాము ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు.
¶ గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు.
అతడు “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు.
నువ్వు అనేక సంవత్సరాలు వారిని సహించి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారిని హెచ్చరించినా వారు లక్ష్యపెట్ట లేదు. అందువల్ల నువ్వు వాళ్ళని పొరుగు ప్రాంతాల ప్రజలకు అప్పగించేశావు.
ఆ రోజుల్లో యెహోవా ఆమోజు కొడుకు యెషయా ద్వారా మాట్లాడి ఇలా చెప్పాడు. “నువ్వు వెళ్ళు. నీ నడుముకి కట్టుకున్న గోనె పట్టా విప్పు. నీ పాదాలకున్న జోళ్ళు విడిచిపెట్టు.” అతడు అలాగే చేశాడు. చెప్పులు లేకుండా, వట్టి కాళ్ళతో నడిచాడు.
¶ యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు వెళ్లి అవిసెనార నడికట్టు కొనుక్కుని నీటితో తడపకుండానే నీ నడుముకు కట్టుకో.”
ఈ మాటలు చెప్పిన తరువాత నీతో వచ్చిన మనుష్యులు చూస్తుండగా నువ్వు ఆ కుండ పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి.”
¶ అయితే నరపుత్రుడా, ఒక పెంకు తీసుకో. దాన్ని నీముఖానికి ఎదురుగా ఉంచుకో. దాని పైన యెరూషలేము పట్టణం నమూనాను చిత్రించు.
అప్పుడు నేను ఇలా అన్నాను “అయ్యో ప్రభూ, యెహోవా, వాళ్ళు నా గురించి, ‘వీడు కేవలం ఉపమానాలు చెప్పేవాడేగదా?’ అంటున్నారు.”
¶ యెహోవా నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఎండు ద్రాక్షముద్దలను ఆశించి ఇతర దేవుళ్ళను పూజించినా నేను, యెహోవాను, వారిని ప్రేమించినట్టే తన భర్త ప్రేమను చూరగొనిన వ్యభిచారిణి దగ్గరికి పోయి ఆమెను ప్రేమించు.”
¶ తరువాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. మీ ముసలివారు కలలుకంటారు. మీ యువకులకు దర్శనాలు వస్తాయి.
‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు. మీ యువకులు దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కంటారు,
¶ నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత.