¶ ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు. వాళ్ళు యెహోవా దృష్టికి దోషులైన కారణంగా యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధం చెయ్యడానికి మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు.
TSK
TSK · హోషేయ 6:4
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. ఆయన కీర్తిని గానం చేశారు.
ఇంత జరిగినా విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా పైపైనే గాని తన పూర్ణహృదయంతో నా దగ్గరికి రావడం లేదు.
నీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని వారి పేరున ప్రమాణం చేస్తారు. నేను వారిని సమృద్ధిగా పోషించాను కానీ వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఇళ్ళలో సమావేశం అవుతారు. వారిని నేనెందుకు క్షమించాలి?
ఈ ప్రజలు తిరుగుబాటు, ద్రోహం చేసే మనస్సు గలవారు, వారు పక్కకు తొలగిపోతున్నారు.
¶ “మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకుని, ఒక్కొక్కడు తన పొరుగువాడికి విడుదల ప్రకటిస్తామని చెప్పి, నా పేరు పెట్టిన ఈ మందిరంలో నా సన్నిధిలో ఒప్పందం చేశారు. నా దృష్టిలో ఏది మంచిదో అది చెయ్యడం మొదలుపెట్టారు.
¶ ఎఫ్రాయిమూ, నేనెలా నిన్ను విడిచిపెడతాను? ఇశ్రాయేలూ, నేను నిన్ను శత్రువులకు ఎలా అప్పగిస్తాను? అద్మాలాగా నిన్ను నేను ఎలా చేస్తాను? సెబోయీముకు చేసినట్టు నీకు ఎలా చేస్తాను? నా మనస్సు మారింది. నా కనికరం రేగింది.
‹అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు.›
¶ ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు.