TSK

TSK · హోషేయ 7:15

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఎలాగంటే యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు. అతని మూలంగా ఇశ్రాయేలు వారు సిరియా వారి వశంలోనుండి తప్పించుకుని మునుపటి లాగానే తమ సొంత పల్లెల్లో కాపురం ఉన్నారు.

ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడు యోనా అనే ప్రవక్త ద్వారా చెప్పిన మాట చొప్పున ఇతడు హమాతుకు వెళ్ళే దారి మొదలుకుని అరాబా సముద్రం వరకూ ఇశ్రాయేలువాళ్ళ సరిహద్దును మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు.

జాతులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయి? ప్రజా సమూహాలు ఎందుకు వ్యర్ధమైన కుట్ర చేస్తున్నాయి?

యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు.

¶ కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.

¶ ఇశ్రాయేలూ, నీ మీదికి వచ్చి పడేది నీ నాశనమే. నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివయ్యావు.

వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.

‹నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.›