TSK

TSK · యెషయా 11:15

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు.

¶ అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి.

ఆ దినాన యెహోవా నది (యూప్రటీసు) అవతలి నుండి కిరాయికి వచ్చే మంగలి కత్తితో, అంటే అష్షూరు రాజు చేత నీ తల వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను గొరిగిస్తాడు. అది నీ గడ్డాన్ని కూడా గొరిగిస్తుంది.

ఆ రోజున ఐగుప్తు ప్రజలంతా స్త్రీల వలే ఉంటారు. సేనల ప్రభువు అయిన యెహోవా వారిపై తన చెయ్యి ఎత్తుతాడు. దాని కారణంగా వాళ్ళు భయపడి వణుకుతారు.

యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ను పొడిచేసింది నువ్వే గదా?

¶ నదులను ఎండగొట్టి ఆ నేను ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మి వేస్తాను. విదేశీయులతో నేను ఆ దేశాన్ని, దానిలో ఉన్నదంతా పాడు చేయిస్తాను. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”

¶ ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.