తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు?
TSK
TSK · యెషయా 13:7
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ అందుకే వాటి ప్రజలు బలహీనులై చెదరిపోయారు. భయంతో పొలంలోని గడ్డిలాగా, బలం లేని కాడల్లాగా మారారు.
బబులోను రాజు వాళ్ళను గూర్చిన సమాచారం విన్నాడు. భయంతో అతని చేతులు చచ్చుబడి పోయాయి. ప్రసవించ బోయే స్త్రీకి కలిగే వేదన లాంటిది అతనికి కలిగింది.
అప్పుడు ‘నువ్వు ఎందుకు మూలుగుతున్నావు?’ అని వారు అడుగుతారు. అప్పుడు నువ్వు వాళ్ళతో, ‘కష్టదినం వచ్చేస్తోందనే దుర్వార్త నాకు వినిపించింది. అందరి గుండెలూ కరిగిపోతాయి. అందరి చేతులూ బలహీనం అవుతాయి. అందరి మనస్సులూ సొమ్మసిల్లిపోతాయి, అందరి మోకాళ్లు నీరుగారిపోతాయి. ఇంతగా కీడు వస్తూ ఉంది. అది వచ్చేసింది’ అని చెప్పు. ఇదే యెహోవా వాక్కు.”
ఆయన తీవ్రమైన కోపాన్ని తట్టుకోగలిగేవాడు ఎవడు? ఆయన ఉగ్రత ఎదుట ఎవ్వరూ నిలబడలేరు. ఆయన కోపం అగ్ని ప్రవాహంలాగా పారుతుంది. ఆయన కొండలను బద్దలయ్యేలా చేస్తాడు.
¶ సింహాల గుహ ఏమయింది? సింహపు పిల్లల మేత మేసే స్థలం ఏమయింది? ఎవరి భయం లేకుండా సింహం, ఆడ సింహం, సింహం పిల్లలు తిరిగిన స్థలం ఏమయింది?