మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు
TSK
TSK · యెషయా 17:12
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.
యెహోవా, మహా సముద్రాలు పైకి లేచాయి, అవి తమ గొంతెత్తాయి, మహా సముద్రాల అలలు ఎగిసిపడి హోరెత్తుతున్నాయి.
వారు ఆ దినాన సముద్ర ఘోష వలె తమ ఎరపై గర్జన చేస్తారు. ఒకడు దేశం కేసి చూస్తే అంధకారం, దురవస్థ కనిపిస్తాయి. మేఘాలు కమ్మి వెలుగంతా చీకటై పోతుంది.
యుద్ధ శబ్దం చేసే పాద రక్షలు, రక్తంలో పొర్లించిన వస్త్రాలు అగ్నిలో కాలి, ఆ అగ్నికి ఇంధనం ఔతాయి.
వారు బాణాలు, ఈటెలు వాడతారు. వారు జాలిలేని క్రూర జనాంగం. వారి స్వరం సముద్ర ఘోషలాగా ఉంటుంది. సీయోను కుమార్తెలారా, వారు గుర్రాలపై స్వారీ చేస్తూ వస్తారు. నీతో యుద్ధం చేయడానికి వారు యోధుల్లాగా బారులు తీరి ఉన్నారు.
దానియేలు వివరించి చెప్పిన దేమిటంటే రాత్రి వేళ దర్శనాలు కలిగి నప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి వీయడం నాకు కనబడింది.
¶ ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, “అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను రా.