బలిపీఠం పైన అగ్ని ఎప్పటికీ మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు.
TSK
TSK · యెషయా 31:9
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? వాళ్ళు నమ్ముకున్న బండ ఏది?
కాబట్టి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అష్షూరీయుల ప్రఖ్యాత యోధుల మీదకు బక్కచిక్కి కృశించిపోయే రోగం పంపిస్తాడు. వారు ఆయన మహిమ కింద అగ్ని రాజుకుని కాలిపోతారు.
ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది.
ప్రపంచంలో నివసించే మీరు, భూమిపైన జీవించే మీరు పర్వతాల పైన సంకేతంగా జెండా ఎత్తినప్పుడు చూడండి! బాకా ఊదినప్పుడు వినండి!
తగలబెట్టే స్థలం చాలా కాలం కిందే సిద్ధం అయి ఉంది. నిజంగా రాజు కోసం సిద్ధం అయింది. దాన్ని దేవుడు లోతుగా, విశాలంగా చేశాడు. తగలబెట్టడానికి మంటలు, విస్తారంగా కట్టెలు సిద్ధంగా ఉన్నాయి. యెహోవా శ్వాస గంధక ప్రవాహంలా దాన్ని తగలబెడుతుంది.
“నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి పనికి రాని వాళ్ళలా ఉన్నారు. వాళ్ళందరూ కొలిమిలో మిగిలిపోయిన ఇత్తడి, తగరంలా, పనికి రాని ఇనుము, సీసంలా ఉన్నారు. వాళ్ళు నీ కొలిమిలో మిగిలి పోయిన పనికి రాని వెండిలా ఉన్నారు.”
¶ సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నియమిత దినం రాబోతుంది. అది కాలుతూ ఉన్న కొలిమిలాగా ఉంటుంది. గర్విష్ఠులంతా, దుర్మార్గులంతా ఎండుగడ్డిలాగా ఉంటారు. వారిలో ఒక్కరికి కూడా వేరు గానీ, చిగురు గానీ ఉండదు. రాబోయే ఆ దినాన అందరూ తగలబడి పోతారు.