‘వాళ్ళను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటాను’ అని శత్రువు అనుకున్నాడు.
TSK
TSK · యెషయా 33:10
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
యెహోవా, కోపంతో లేచి రా, నా శత్రువుల ఆగ్రహానికి విరోధంగా నిలబడు. నా నిమిత్తం లేచి వచ్చి వాళ్ళ కోసం నువ్వు ఆజ్ఞాపించిన న్యాయ విధులను జరిగించు.
యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం.
అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు.
యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచీ, ఆయన ప్రభావ మహత్యం నుంచీ పారిపోయి కొండ గుహల్లో, కొండ బండల నెర్రెల్లో మనుషులు దాగి ఉంటారు.
చూడండి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భీకర శబ్దంతో కొమ్మలను తెగగొట్టినప్పుడు ఎత్తయిన చెట్లు కూలిపోతాయి. గంభీరమైనవి పడిపోతాయి.
యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు.
¶ సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు. సమరయ కొండల మీద దర్జాగా బతికే వారికి బాధ తప్పదు. ఇశ్రాయేలు వారికి సలహాదారులుగా ఉన్న గొప్ప రాజ్యాల్లోని ముఖ్య పెద్దలకు బాధ తప్పదు.