TSK

TSK · యెషయా 33:23

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుష్టులు, పనికిమాలిన వారు కొంతమంది “వీళ్ళు మనతో కూడా రాలేదు గనక వారి భార్యలనూ పిల్లలనూ తప్ప మనకు దక్కిన దోపుడు సొమ్ములో ఏమీ వీరికి ఇవ్వనక్కర లేదు. తమ భార్య పిల్లలను మాత్రం వారు తీసికోవచ్చు” అన్నారు.

¶ ఇక ప్రజలు బయటకు వెళ్ళి సిరియా సైన్యం శిబిరాన్ని దోచుకున్నారు. అప్పుడు యెహోవా వాక్కు ప్రకారం ఒక తులం వెండికి నాలుగు కిలోల గోదుమ పిండీ, ఒక తులం వెండికి ఎనిమిది కిలోల యవలూ అమ్మారు.

సైన్యాలున్న రాజులు పారిపోతారు. వారు పారిపోతారు. ఇళ్ళలో ఉండే స్త్రీలు దోపుడు సొమ్ము పంచుకుంటారు.

దోపిడీకి గురి కాకుండా దోచుకుంటూ ఉండే నీకు బాధ! ద్రోహానికి గురి కాకుండానే ద్రోహం చేస్తూ ఉండే నీకు బాధ! నువ్వు నాశనం చేయడం ముగించిన తర్వాతే నువ్వు నాశనం అవుతావు. నువ్వు ద్రోహం చేయడం ముగించిన తర్వాత నీకు ద్రోహం జరుగుతుంది.

దానికి ప్రతిగా విశాలమైన నదులూ, నీటి వాగులూ ఉన్న ఆ స్థలంలో యెహోవా తన ప్రభావంతో మనతో ఉంటాడు. తెడ్లు వేసుకుంటూ అక్కడ ఏ యుద్ధనౌకా ప్రయాణించదు. పెద్ద నౌకలేవీ అక్కడ ప్రయాణించవు.

కాబట్టి వారు గుర్తు పట్టలేకపోయారు వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు.