యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.
TSK
TSK · యెషయా 35:8
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.
¶ ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది.
¶ “జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది.
ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వచ్చిన రోజున వాళ్లకు దారి ఉన్నట్టు, అష్షూరులో మిగిలిన ఆయన ప్రజలు అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్లకు రాజమార్గం ఉంటుంది.
మీరు కుడి వైపు గానీ ఎడమ వైపు గానీ తిరిగినప్పుడు “ఇదే మార్గం. దీనిలోనే నడవండి” అని వెనుక నుండి ఒక శబ్దాన్ని మీరు వింటారు.
వినండి, అడవిలో ఒకడు ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు, “అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని రాజమార్గం తిన్నగా చేయండి.”
ఇదిగో, నేనొక కొత్త కార్యం చేస్తున్నాను. అది ఇప్పటికే మొదలైంది. మీరు దాన్ని గమనించరా? నేను అరణ్యంలో దారి నిర్మిస్తాను. ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను.
సీయోనూ! లే! నీ బలం తెచ్చుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ అందమైన బట్టలు వేసుకో. ఇక ఎన్నటికీ సున్నతి పొందని వాడొకడైనా, అపవిత్రుడొకడైనా నీ లోపలికి రాడు.
ఆయన ఇలా అంటాడు. “కట్టండి, కట్టండి! దారి సిద్ధం చేయండి! నా ప్రజల దారిలో అడ్డంగా ఉన్న వాటిని తీసేయండి.”
ద్వారాల గుండా రండి! రండి! ప్రజలకు దారి సిద్ధం చేయండి! జాతీయ మార్గాన్ని కట్టండి! రాళ్ళు ఏరి పారవేయండి! రాజ్యాల కోసం జండా సూచన ఎత్తండి!
ఇశ్రాయేలు కుమారీ, రహదారిలో గుర్తులు పెట్టించుకో. దోవ చూపే స్థంభాలు పాతించుకో. నువ్వు వెళ్ళాల్సిన సరైన దారివైపు నీ మనస్సు నిలుపుకో. తిరిగి రా, నీ పట్టణాలకు తిరిగిరా.
ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “ఆ రోజుల్లో ఆ సమయంలో యూదా ప్రజలూ, ఇశ్రాయేలు ప్రజలూ ఏడుస్తూ తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కలిసి వస్తారు.
¶ కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తూ ఉండి హృదయంలో, శరీరంలో సున్నతి లేని అన్యుల్లో ఎవరూ నా పరిశుద్ధస్థలాల్లో ప్రవేశింపకూడదు.
¶ ఆ కాలంలో గుర్రాల కళ్ళాల పైన “యెహోవాకు ప్రతిష్టితం” అని రాసి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంటపాత్రలను బలిపీఠం ఎదుట ఉన్న గిన్నెల వలె పవిత్రంగా ఎంచుతారు.
‹ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు.›
యేసు అతనితో, ‹“నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.›
పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.
¶ చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది.
అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు.
¶ చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.
¶ కాని, మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. అందుచేత మీ అందరికీ సత్యం తెలుసు.
అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.