వాళ్ళు క్రూరత్వం నిండినవారై ముసలివాళ్ళను, పసి పిల్లలను కూడా తీవ్రంగా హింసిస్తారు.
TSK
TSK · యెషయా 47:6
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
నా తండ్రి బరువైన కాడి మీమీద మోపాడు గాని నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి చెర్నాకోలతో మిమ్మల్ని దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను’ అని చెప్పు.”
¶ అందుచేత ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పించాడు. అతడు వారి పరిశుద్ధ స్థలం లోనే వారి యువకులను కత్తితో చంపేసాడు. అతడు యువకుల మీద గానీ, కన్యల మీద గానీ ముసలి వారి మీద గానీ నెరసిన వెంట్రుకలు గల వారి మీద గానీ జాలి పడలేదు. దేవుడు వారందరినీ అతని వశం చేశాడు.
మా పూర్వీకులు ఆకాశంలో నివాసముండే దేవునికి కోపం పుట్టించినందువల్ల ఆయన వారిని కల్దీయుడైన బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బబులోను దేశానికి బందీలుగా తీసుకువెళ్ళాడు.
భక్తిహీనులైన ప్రజల మీదకి నేను వాళ్ళను పంపిస్తాను. కొల్లసొమ్ము దోచుకోడానికీ, వేటాడింది తెచ్చుకోడానికీ, వాళ్ళను వీధుల్లో మట్టి తొక్కినట్టు తొక్కడానికీ, నా ఉగ్రతకు పాత్రులైన అహంకార ప్రజలకు విరోధంగా అతన్ని పంపిస్తాను.
‘భూమిని కంపింపజేసి రాజ్యాలను వణకించినవాడు ఇతడేనా? లోకాన్ని నిర్జన ప్రదేశంగా చేసి, దాని పట్టణాలను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వాళ్ళను తమ నివాసస్థలానికి వెళ్ళనివ్వనివాడు ఇతడేనా?’
కాబట్టి దేవాలయంలో ప్రతిష్ఠితులైన నాయకులను అపవిత్రపరుస్తాను. యాకోబును శాపానికి గురిచేసి, దూషణ పాలు చేస్తాను.”
¶ యెహోవా తన సన్నిధిలోనుంచి వాళ్ళను చెదరగొట్టాడు. ఇంక ఆయన వాళ్ళను పట్టించుకోడు. ఇంక యాజకులపట్ల ఎవరూ గౌరవం చూపించరు. పెద్దల పట్ల ఎవరూ దయ చూపించరు.
¶ అయితే నీ వ్యాపారం ఎక్కువ కావడం వలన నువ్వు దౌర్జన్యంతో నిండిపోయి, పాపం చేశావు. కాబట్టి కావలిగా ఉన్న కెరూబూ, దేవుని పర్వతం మీద నిప్పుకణికల్లాంటి రాళ్లమధ్య నువ్వుండకుండా నేను నిన్ను తోలివేసి, నిర్మూలం చేశాను.
మీరు నా పవిత్ర పర్వతం పై తాగినట్టు రాజ్యాలన్నీ ఎప్పుడూ తాగుతూ ఉంటాయి. తాము ఎన్నడూ ఉనికిలో లేని వారి లాగా ఉండి తాగుతుంటారు.
ఏమీ పట్టనట్టు ఉన్న ఇతర దేశాల ప్రజలపై నాకు తీవ్రమైన కోపం ఉంది. ఇంతకు ముందు నాకున్న కోపం స్వల్పమే గానీ వారు కీడును వృద్ది చేసుకున్నారు.
కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.