TSK

TSK · యెషయా 5:3

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.

పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు.

¶ ‹అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు.›

¶ నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు.