TSK

TSK · యెషయా 5:9

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

యిర్మీయా పలికిన యెహోవా మాట నెరవేరేలా దేశం విశ్రాంతి అనుభవించే వరకూ ఇది సంభవించింది. దేశం పాడుగా ఉన్న 70 ఏళ్ల కాలం దానికి విశ్రాంతి కాలంగా ఉంది.

¶ లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.

¶ “ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా,

అలాగే ప్రాకారాలున్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. నివాస స్థలాలు మనుషులు లేని అరణ్యాల్లా మారతాయి. అక్కడ దూడలు మేస్తాయి. అవి అక్కడే పడుకుని చెట్ల కొమ్మలను తింటాయి.

మీరు పేదలను అణగదొక్కుతూ ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించరు. మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా ఆ ద్రాక్ష మద్యం తాగరు.

¶ ‹కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.›