ఆ కాలంలో సిరియా రాజు రెజీను ఏలతును మళ్ళీ పట్టుకుని సిరియనుల వశం చేసి, ఏలతులోనుంచి యూదా వాళ్ళను వెళ్లగొట్టినప్పుడు సిరియనులు ఏలతు పట్టణానికి వచ్చి నివాసం ఉన్నారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు.
TSK
TSK · యెషయా 9:12
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
వాళ్ళు యాకోబు సంతతిని దిగమింగారు. అతని గ్రామాలను పాడు చేశారు.
దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది.
మనష్షే ఎఫ్రాయిమునీ, ఎఫ్రాయిము మనష్షేనీ తినేస్తారు. వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. ఇలా జరిగినా ఆయన కోపం చల్లారదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.
“ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి పట్టించుకోకుండా, ఆలోచన కోసం యెహోవా దగ్గరకి వెళ్ళకుండా సహాయం కోసం ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళకీ, గుర్రాలపై ఆధార పడేవాళ్ళకీ, అసంఖ్యాకంగా ఉన్న వాళ్ళ రథాలపైనా, లెక్కకు మించిన రౌతుల పైనా నమ్మకం ఉంచే వాళ్ళకీ బాధ!
నిన్నెరగని అన్యజనాల మీదా నీ పేరున ప్రార్థించని వంశాల మీదా నీ కోపాన్ని కుమ్మరించు. ఎందుకంటే వారు యాకోబు వంశాన్ని పూర్తిగా నిర్మూలం చేయడానికి మింగివేశారు. దాని నివాస స్థలాలను పాడు చేశారు.
కాని, బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశం మీద దాడి చేసినప్పుడు, ‘కల్దీయుల సైన్యం, సిరియనుల సైన్యం నుంచి మనం తప్పించుకుని యెరూషలేముకు వెళ్దాం రండి’ అని మేము చెప్పుకున్నాం కాబట్టి మేము యెరూషలేములో నివాసం ఉంటున్నాం” అని చెప్పారు.
¶ మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
విస్తారమైన మీ తోటలన్నిటినీ తెగుళ్ళతో నేను పాడు చేశాను. మీ ద్రాక్షతోటలనూ అంజూరపు చెట్లనీ ఒలీవచెట్లనూ మిడతలు తినేశాయి. అయినా మీరు నావైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు నేను మీలో కొంతమందిని నాశనం చేశాను. మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
¶ అది దేవుని మాట ఆలకించలేదు. శిక్షకు అంగీకరించ లేదు. యెహోవా పట్ల విశ్వాసముంచదు. దాని దేవుని దగ్గరికి రాదు.