TSK

TSK · యెషయా 9:16

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

అప్పుడు అతడు పెద్ద స్వరంతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఈ విధంగా దీవించాడు,

చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు. స్త్రీలు వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని మీ మార్గంలో అయోమయం పాలుచేసి తప్పు దోవ పట్టిస్తారు.

నువ్వు బందీలైన వాళ్ళ కింద ముడుచుకుని దాక్కున్నావు. హతమైన వాళ్ళతోపాటు పడి ఉన్నావు. అయినా యెహోవా కోపం చల్లారలేదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.

కాబట్టి వాళ్ళ పిల్లలను కరువుపాలు చెయ్యి. వాళ్ళను కత్తికి అప్పగించు. వాళ్ళ భార్యలు సంతానాన్ని కోల్పోయేలా వితంతువులయ్యేలా చెయ్యి. వాళ్ళ పురుషులు చావాలి. వాళ్ళ యువకులు యుద్ధంలో కత్తితో చావాలి.

¶ ‹“అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు.›