కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను.
TSK
TSK · యిర్మీయా 2:20
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ మోషే వచ్చి యెహోవా మాటలను, కట్టుబాట్లను ప్రజలకు వివరించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తాం” అని ముక్త కంఠంతో జవాబిచ్చారు.
మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశంలోనుండి మిమ్మల్ని రప్పించాను. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి అడ్డకొయ్యలు విరగగొట్టి మిమ్మల్ని తలెత్తుకుని నడిచేలా చేశాను.
¶ మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా?
¶ మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి.
యెహోవాయే మీకు దేవుడుగా ఉన్నాడనీ మీరు ఆయన మార్గాల్లో నడిచి, ఆయన చట్టాలనూ, ఆజ్ఞలనూ, విధులనూ అనుసరిస్తూ ఆయన మాట వింటామనీ ఈనాడు ఆయనకు మాట ఇచ్చారు.
¶ ప్రజలు “మన దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయన మాటే వింటాం” అని యెహోషువతో చెప్పారు.
ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి, బయలు దేవుళ్ళను పూజించారు.
¶ ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో మళ్ళీ చెడుగా ప్రవర్తించి యెహోవాను విడిచిపెట్టి ఆయన సేవ మాని, బయలులు, అష్తారోతులు అనే అరామీయుల దేవతలను, సీదోనీయుల దేవుళ్ళను, మోయాబీయుల దేవుళ్ళను, అమ్మోనీయుల దేవుళ్ళను, ఫిలిష్తీయుల దేవుళ్ళను, పూజించడం మొదలుపెట్టారు.
¶ యరొబాము యూదా దేశంలో జరిగే మహోత్సవం లాంటి ఉత్సవాన్ని ఎనిమిదవ నెల పదిహేనవ రోజున జరపడానికి నిర్ణయించి, బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా బేతేలులో కూడా తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తూ వచ్చాడు. తాను చేయించిన ఉన్నత స్థలాలకు యాజకులను బేతేలులో ఉంచాడు.
వాళ్ళు మనకు వేసిన సంకెళ్ళు తెంపేద్దాం రండి. వాళ్ళ గొలుసులు విసిరి పారేద్దాం రండి, అని చెప్పుకుంటున్నారు.
నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది! అది న్యాయంతో నిండి ఉండేది. నీతి దానిలో నివాసం ఉండేది. ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు.
ఆ రోజున నీ భుజం మీద నుంచి అతని బరువు, నీ మెడ మీద నుంచి అతని కాడి తీసివేయడం జరుగుతుంది. నీ మెడ బలంగా ఉన్న కారణంగా ఆ కాడి నాశనం అవుతుంది.
సింధూర వృక్షాల కింద, పచ్చని ప్రతి చెట్టు కింద, కామంతో రగిలిపోయే మీరు, లోయల్లో రాతిసందుల కింద, మీరు మీ పిల్లలను చంపుతున్నారు.
నీ తలెత్తి చెట్లు లేని కొండప్రదేశాలను చూడు. మనుషులు నీతో వ్యభిచారం చేయని స్థలం ఏదైనా ఉందా? ఎడారి దారిలో సంచార జాతి వాడు కాచుకుని ఉన్నట్టు నువ్వు వారి కోసం దారి పక్కన కూర్చుని ఎదురు చూశావు. నీ వ్యభిచారంతో, నీ దుష్ట ప్రవర్తనతో నువ్వు దేశాన్ని అపవిత్రం చేశావు.
నీ వ్యభిచారం, కామంతో కూడిన నీ సకిలింపులు నీ జార కార్యాలు నాకు తెలుసు. పొలాల్లోని ఉన్నత స్థలాల్లో నీవు చేసిన అసహ్యమైన కార్యాలు నాకు కనబడుతున్నాయి. యెరూషలేమా, నీకు శ్రమ. నిన్ను నువ్వు పవిత్ర పరచుకోవడం లేదు. ఇలా ఎంత కాలం కొనసాగుతుంది?
¶ సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “ఆ రోజు, నీ మెడ మీద ఉన్న నీ కాడి విరిచి, నేను నీ బంధకాలు తెంపుతాను. ఇంక విదేశీయులు నీ చేత దాస్యం చేయించుకోరు.
నువ్వు నీ కోసం ఒక బలిపీఠం, ప్రతి బహిరంగ ప్రాంగణంలో ఒక గుడి కట్టించావు.
నువ్వు ప్రతి వీధి మొదట్లో బలిపీఠాలు, ప్రతి బహిరంగ ప్రదేశంలో గుళ్ళు కట్టి, నిజానికి నువ్వు ఒక వేశ్య చేసినట్టు చెయ్యలేదు. ఎందుకంటే నువ్వు చేసిన వేశ్యక్రియలకు డబ్బు తీసుకోలేదు!
వాళ్లకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోకి నేను వాళ్ళను రప్పించిన తరువాత, ఒక ఎత్తయిన కొండను గాని, ఒక దట్టమైన చెట్టును గాని వాళ్ళు చూసినప్పుడెల్లా బలులు అర్పిస్తూ, అర్పణలు అర్పిస్తూ, అక్కడ పరిమళ ధూపం వేస్తూ, పానార్పణలు చేస్తూ, నాకు కోపం పుట్టించారు.”
¶ యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు. “వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో. ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు. ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది.”
ఆమెతో ఇలా అన్నాను. “సుదీర్ఘకాలం నీవు నాతో ఉండిపో. వేశ్యగానైనా, ఏ మగవాడికి చెందిన దానిగానైనా ఉండవద్దు. నేను కూడా నీపట్ల అలానే ఉంటాను.”
వాళ్ళు మీపై మోపిన కాడిని విరిచివేస్తాను. వారి బంధకాలను తెంచివేస్తాను.