TSK

TSK · యిర్మీయా 29:3

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

తరువాత రాజు యాజకుడైన హిల్కీయా, షాఫాను కొడుకు అహీకాము, మీకాయా కొడుకు అక్బోరు అనే వాళ్ళనూ, షాఫాను అనే శాస్త్రినీ, అశాయా అనే రాజసేవకుల్లో ఒకణ్ణి పిలిచి వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు.

హిల్కీయాకూ, షాఫాను కొడుకు అహీకాముకూ, మీకా కొడుకు అబ్దోనుకూ, శాస్త్రి అయిన షాఫానుకూ, రాజు సేవకుడు అశాయాకూ ఇలా ఆజ్ఞాపించాడు,

అయితే షాఫాను కొడుకు అహీకాము యిర్మీయాకు సాయపడ్డాడు. అతణ్ణి చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.

చెరసాల ప్రాంగణంలో నుంచి యిర్మీయాను తెప్పించి, అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాకు అతన్ని అప్పగించారు. అప్పుడు యిర్మీయా ప్రజల మధ్య నివాసం చేశాడు.