అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెతికితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.
TSK
TSK · యిర్మీయా 3:1
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ “ఎవరైనా ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని, ఆ తరువాత ఆమె ఇంతకు ముందే పరాయి పురుషునితో లైంగికంగా సంబంధం కలిగి ఉన్నట్టు అనుమానం కలిగితే ఆమెపై అతనికి ఇష్టం తొలగిపోతే అతడు ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట్లోనుంచి ఆమెను పంపేయాలి.
అయితే ఆమె అతణ్ణి విడిచి పెట్టి మరొకరితో వ్యభిచారం చేసింది. ఆమె యూదా ప్రాంతం బెత్లేహెం లోని తన తండ్రి ఇంటికి వెళ్లి అక్కడే నాలుగు నెలలు ఉండిపోయింది.
యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి.
పూర్వకాలం నుండి ఉన్న నీ కాడిని విరగగొట్టి, నీ బంధకాలను తెంపివేశాను. అయినా “నేను నిన్ను పూజించను” అని చెబుతున్నావు. ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా వేశ్యలాగా వ్యభిచారం చేశావు.
రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది.
ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను. “మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరకే మేం వస్తున్నాం” అనే ఈ మాటలన్నీ అబద్ధాలు.
¶ యెరూషలేమా, నీకు విమోచన కావాలంటే నీ హృదయంలోని చెడుగును కడుక్కో. ఎంతకాలం పాపం చేయాలని కోరుకుంటావు?
నమ్మకద్రోహం చేసే అమ్మాయీ, నువ్వు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుతావు? యెహోవా భూమి మీద కొత్త సృష్టి చేశాడు. బలవంతులైన పురుషులను సంరక్షించడానికి స్త్రీలు వారి చుట్టూ ఆవరిస్తున్నారు.
నీకు తృప్తి లేక, అష్షూరువాళ్ళతో కూడా నువ్వు ఒక వేశ్యలా ప్రవర్తించావు. వేశ్యలా ప్రవర్తించినా, నీకు తృప్తి కలగలేదు.
¶ నీ హృదయం ఎందుకింత బలహీనంగా ఉంది?” ఇది ప్రభువైన యెహోవా వాక్కు “సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటనన్నిటినీ జరిగించడానికి
వాళ్ళల్లో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె చెల్లి పేరు ఒహొలీబా. వీళ్ళను నేను పెళ్లి చేసుకున్నప్పుడు, నాకు కొడుకులనూ, కూతుళ్ళనూ కన్నారు. ఒహొలా అనే పేరుకు షోమ్రోను, ఒహొలీబా అనే పేరుకు యెరూషలేము అని అర్థం.
¶ యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు. “వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో. ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు. ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది.”
¶ ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.
కాబట్టి నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీ వైపు తిరుగుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.