TSK

TSK · యిర్మీయా 4:8

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఆయన విపత్తును కలిగించే దూతలుగా తన ఉగ్రతను, మహోగ్రతను, బాధను వారి మీదికి పంపించాడు.

తూర్పున సిరియా, పడమట ఫిలిష్తీయులు నోరు తెరచి ఇశ్రాయేలును మింగేస్తారు. ఇంత జరిగినా కోపంలో ఉన్న యెహోవా ఆగడు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంది.

మనష్షే ఎఫ్రాయిమునీ, ఎఫ్రాయిము మనష్షేనీ తినేస్తారు. వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. ఇలా జరిగినా ఆయన కోపం చల్లారదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.

బిగ్గరగా అరవండి, ఎందుకంటే, యెహోవా దినం దగ్గరపడింది. అది సర్వశక్తుడైన దేవుని దగ్గర నుండి విధ్వంసం తెస్తుంది.

ఆ రోజున ఏడవడానికీ, అంగలార్చడానికీ, తలలు బోడి చేసుకోడానికీ, గోనె పట్ట కట్టుకోడానికీ సేనల ప్రభువైన యెహోవా పిలుపునిచ్చాడు.

నా ప్రజలారా, వినాశనకారి హఠాత్తుగా మా మీదికి వస్తాడు. గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకోండి. ఒక్కడే కొడుకును గూర్చి ఎలా దుఃఖిస్తారో ఆ విధంగా విలపించండి. బహు ఘోరంగా విలపించండి.

తన కార్యం జరిగించే వరకూ, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకూ యెహోవా కోపాగ్ని చల్లారదు. చివరి రోజుల్లో మీరు దీన్ని అర్థం చేసుకుంటారు.”

¶ నరపుత్రుడా, శోకించు, సాయం కోసం కేకలుపెట్టు! ఆ కత్తి నా ప్రజల మీదకీ, ఇశ్రాయేలీయుల నాయకుల మీదకీ వచ్చింది. కత్తి భయం నా ప్రజలకు కలిగింది గనుక శోకంతో నీ తొడ చరుచుకో!

¶ యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.”

నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో. నీ వెంట్రుకలు కత్తిరించుకో. రాబందులాగా బోడిగా ఉండు. నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.