TSK

TSK · యోబు 20:6

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు.

ఆ చెట్టు క్రమంగా పెరుగుతూ బ్రహ్మాండంగా వృద్ది చెందింది. దాని కొమ్మలు ఆకాశాన్ని అందుకునేటంత ఎత్తుగా ఉన్నాయి. దాని ఆకారం భూమి అంత విశాలం అయ్యింది.

చచ్చిన వాళ్ళుండే చోటుకు వాళ్ళు చొచ్చుకు పోయినా అక్కడనుంచి నా చెయ్యి వాళ్ళను బయటికి లాగేస్తుంది. వాళ్ళు ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ నుంచి వాళ్ళను దించేస్తాను.

గద్దలా నువ్వు పై పైకి ఎగిరినా నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడనుంచి నిన్ను కింద పడేస్తాను, అని యెహోవా చెబుతున్నాడు.