TSK

TSK · యోబు 42:6

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు.

¶ జరిగినదంతా మొర్దెకై విన్నాడు. అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకున్నాడు. నగరం నడిబొడ్డుకు వెళ్లి మహా శోకంతో విలపించాడు.

నువ్వు నన్ను గుంటలో పడేస్తావు. అప్పుడు నేను వేసుకున్న బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.

అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు.

విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి. దేవా, విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.

నేను కోరేది అలాంటి ఉపవాసమా? ప్రతివాడు తనను తాను అణుచుకుంటే సరిపోతుందా? ఒకడు రెల్లులాగా తలవంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చోవడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం యెహోవాకు ఇష్టమని మీరనుకుంటారా?

నువ్వు చేసిన వాటన్నిటి కోసం నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దాన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడి, నోరు మూసుకుంటావు.” ఇదే ప్రభువైన యెహోవా ప్రకటన.

అప్పుడు మీరు మీ చెడ్డ ప్రవర్తననూ మీ చెడ్డ పనులనూ గుర్తుకు తెచ్చుకుని మీ అసహ్య కార్యాలు బట్టి, మీ సొంత పాపాల బట్టి, మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.

¶ ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు.

¶ ‹“అయ్యో కొరాజీనూ, నీకు యాతన. అయ్యో బేత్సయిదా, నీకు యాతన. మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకుని బూడిదెలో కూర్చుని మనసు మార్చుకుని ఉండేవారు.›

¶ కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.