¶ అందుకు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు. కారణం లేకుండాా అతణ్ణి నాశనం చెయ్యాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్ధిరంగా నిలబడ్డాడు” అని అన్నాడు.
TSK
TSK · యోబు 9:17
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడు రోజులపాటు రాత్రీ పగలూ అతనితో కలిసి నేలపై కూర్చున్నారు.
నేను మౌనంగా ఉండిపోయాను. ఆయన నన్ను ముక్కలు ముక్కలు చేశాడు. నా మెడ పట్టుకుని విదిలించి నన్ను చిందరవందర చేశాడు. నన్ను గురిగా చేసుకుని వేధిస్తున్నాడు.
ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడిపోయింది. నా కంటిరెప్పల మీద మరణాంధకారం తేలియాడుతున్నది.
గాలితో నన్ను ఎగరగొట్టి కొట్టుకుపోయేలా చేస్తున్నావు. తుఫానుతో నానిపోయేలా చేస్తున్నావు.
నేను న్యాయవంతుడినైనా అబద్ధికునిగా చూస్తున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానని గాయం కలిగింది” అని యోబు అంటున్నాడు.
యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు.
నీ తుఫానుతో వాళ్ళను తరిమి వెయ్యి. నీ సుడిగాలిచేత వారికి భయం పుట్టించు.
ఇదిగో యెహోవా ఆగ్రహం తుఫానులాగా బయలుదేరింది. అది తీవ్రమైన సుడిగాలిలాగా దుర్మార్గుల తల మీదికి విరుచుకుపడుతుంది.
‹వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”›
అందుకు యేసు, ‹“వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు.›