TSK

TSK · యోహాను 10:8

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ “నా మందలో చేరిన గొర్రెలను నాశనం చేస్తూ చెదరగొట్టే కాపరులకు బాధ.” ఇది యెహోవా వాక్కు.

“నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ విషయం చెప్పు. ఆ కాపరులతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తమ కడుపు నింపుకునే ఇశ్రాయేలీయుల కాపరులకు శిక్ష తప్పదు. కాపరులు గొర్రెలను మేపాలి గదా!

¶ నా దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందను మేపు.

¶ ‹మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.›

‹నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.›