¶ అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.
TSK
TSK · యోనా 1:4
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
నిర్గమ 10:19
TSK
నిర్గమ 15:10
TSK
నువ్వు నీ గాలి విసిరి లోతైన నీళ్ళలో సీసం లాగా వాళ్ళను మునిగి పోయేలా చేశావు.
కీర్తన 107:23
TSK
ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు
కీర్తన 135:7
TSK
భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.
ఆమోసు 4:13
TSK
పర్వతాలను రూపించే వాడూ గాలిని పుట్టించేవాడూ ఆయనే. ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు. ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు. భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.
అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి ఫీనిక్సు చేరి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు.