TSK

TSK · న్యాయా 4:12

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

శారీదు నుండి తూర్పుగా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకూ, దాబెరతు నుండి యాఫీయకు ఎక్కింది.

అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరుకు వెళ్లి అక్కడనుండి హుక్కోకు వరకూ సాగింది. దక్షిణం వైపు జెబూలూను, పడమట ఆషేరు దాటి తూర్పున యొర్దాను నది దగ్గర యూదా సరిహద్దు తాకింది.

¶ గిద్యోను, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎలాంటి వారని జెబహును సల్మున్నాను అడిగినప్పుడు వాళ్ళు “నీలాంటివాళ్ళే. వాళ్ళందరూ రాకుమారుల్లా ఉన్నారు” అన్నారు.

నీకు బలిష్టమైన హస్తం ఉంది. నీ హస్తం దృఢమైనది. నీ కుడిచెయ్యి ఘనమైనది.

¶ యాజకులారా, నామాట వినండి. ఇశ్రాయేలు వంశమా, శ్రద్ధగా విను. రాజ వంశమా, విను. మీరు మిస్పా మీద ఉరిగా, తాబోరు మీద వలగా ఉన్నారు. కాబట్టి మీ అందరిపైకీ తీర్పు రాబోతున్నది.