TSK

TSK · లేవీ 18:30

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కి వేయకుండేలా

కాబట్టి నేను విధించిన నియమాన్ని మీరి, దాని పాపదోషం తనపై వేసుకుని దాని వలన చావకుండేలా చూసుకోవాలి. నేను వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను.

¶ ఈ ప్రజలు తమ దేవుళ్ళను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్ళను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

¶ మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు.

యూదా దేశంలో దేవస్థానాలకు అనుబంధంగా మగ వ్యభిచారులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసే నీచమైన పనులను యూదావారు కూడా చేస్తూ వచ్చారు.

¶ ఈ విషయాలన్నీ ముగిసిన తరువాత పెద్దలు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు. “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు అందరూ కనానీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, యెబూసీయుల, అమ్మోనీయుల, మోయాబీయుల, ఐగుప్తీయుల, అమోరీయుల జాతి ప్రజల నుండి తమను తాము ప్రత్యేకపరుచుకోకుండా ఆ జాతుల ప్రజలు చేస్తున్న అసహ్యకరమైన చెడ్డ పనులు వారు కూడా చేస్తున్నారు.