మీరు నన్ను ఆరాధించడానికి వెండి, లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు.
TSK
TSK · లేవీ 26:1
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
పోత పోసిన దేవుళ్ళ విగ్రహాలను తయారు చేసుకోకూడదు.
¶ మీరు పనికిమాలిన దేవుళ్ళ వైపు తిరగకూడదు. మీరు పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
కాబట్టి మీరు భూమి మీద ఉన్న ఏ జంతువు గాని,
యెహోవా దేవునికి మీరు కట్టే బలిపీఠం దగ్గరగా ఏ విధమైన చెట్టును నాటకూడదు, దేవతా స్తంభాన్నీ నిలబెట్టకూడదు.
¶ దాను గోత్రం వాళ్ళు చెక్కిన ప్రతిమను పెట్టుకున్నారు. మోషే మనుమడూ, గెర్షోము కొడుకు అయిన యోనాతాను అనే వాడూ, అతని కుమారులూ ఆ దేశ ప్రజలు బందీలుగా వెళ్ళే వరకూ వారికి యాజకులుగా ఉన్నారు.
ఎత్తయిన కొండలన్నిటి మీదా, ప్రతి పచ్చని చెట్టు కిందా విగ్రహాలు నిలబెట్టి దేవతా స్తంభాలు కట్టించారు.
చెక్కిన ప్రతిమలను పూజించేవాళ్ళు, పనికిరాని విగ్రహాలను బట్టి గొప్పలు చెప్పుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. అలాటి దేవుళ్ళు అందరూ యెహోవాకు మొక్కండి.
ఆ రోజున ప్రజలు ఆరాధన కోసం తాము వెండి బంగారాలతో చేయించుకున్న విగ్రహాలు పారేస్తారు. ఎలుకలకూ, గబ్బిలాలకూ వాటిని విసిరేస్తారు.
అందుకే ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. అవి జరక్కముందే నేను నీకు చెప్పాను. “నా విగ్రహమే వీటిని చేసింది.” లేకపోతే “నేను చెక్కిన బొమ్మ, లేదా నేను పోతపోసిన బొమ్మ దీన్ని నియమించింది” అని నువ్విక చెప్పలేవు.
¶ కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.
ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు.
¶ ‹పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.›