¶ అందుకు సాతాను “యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా?
TSK
TSK · మలాకీ 1:10
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
“యెహోవా ఇలా అంటున్నాడు. విస్తారమైన మీ బలులు నాకెందుకు?” “దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి. దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు.
“వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే.
కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. వారి పొలాలు ఇతరుల స్వాధీనం చేస్తాను. చిన్నలు, పెద్దలు, అందరూ విపరీతమైన దురాశాపరులు. ప్రవక్తలు, యాజకులు, అంతా నయవంచకులు.
¶ వారు గొర్రెలను, ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోతారు గాని, ఆయన వారికి కనబడడు. ఎందుకంటే ఆయన తనను మరుగు చేసుకున్నాడు.
ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.
‹జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది.›
¶ మిగతా వారంతా తమ సొంత పనుల్నే చూసుకుంటున్నారు గాని, యేసు క్రీస్తు విషయాలు చూడడం లేదు.
మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి.