TSK

TSK · మత్తయి 6:30

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా!

యేసు వారితో, ‹“అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?”› అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది.

యేసుకు అది తెలిసి, ‹“అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకు రాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు?›

¶ అప్పుడాయన శిష్యులతో, ‹“మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?”› అని అన్నాడు.

¶ యేసు, ‹“విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?”› అని, ‹“నీ కొడుకుని ఇక్కడికి తీసుకుని రా”› అని ఆ తండ్రితో చెప్పాడు.

తరువాత ఆయన తోమాను చూసి, ‹“నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు”› అన్నాడు.

ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి.