TSK

TSK · నెహెమ్యా 8:7

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

అతడు యాకోబుకు నీ విధులనూ, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు.

¶ తన పాలన మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లోని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే పెద్దలను పంపాడు.

యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడురోజులపాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఏడు రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు.

¶ పషూరు వంశంలో ఎల్యో యేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.

¶ దాని పక్కన లేవీయులు బాగుచేశారు. వారిలో బానీ కొడుకు రెహూము ఉన్నాడు. దాన్ని ఆనుకుని అధికారి హషబ్యా తన భాగం నుండి కెయిలాకు చెందిన సగభాగం దాకా బాగు చేశాడు.

¶ దాని పక్కన తమ యింటికి ఎదురుగా బెన్యామీను, హష్షూబు అనేవారు బాగు చేశారు. దాన్ని ఆనుకుని అనన్యా మనవడు, మయశేయా కొడుకు అజర్యా తన యింటి దగ్గర బాగు చేశాడు.

వారు ఒక పూటంతా అక్కడే నిలబడి దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదివించుకున్నారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకొంటూ దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లిస్తూ వచ్చారు.

¶ లేవీయుల్లో ప్రముఖులైన షబ్బెతై, యోజాబాదులకు దేవుని మందిరం బయటి పనుల నిర్వహించే అధికారం ఇచ్చారు.

దేవుని సేవకుడైన దావీదు ఆజ్ఞ ప్రకారం స్తుతి గీతాలు పాడే వంతు లేవీయుల కుటుంబ యాజకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవలకు, వారికి ఎదురుగా నిలబడి పాడే వంతు వారి బంధువులకు నియమించారు.

¶ యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యా బాకాలు చేతబట్టుకుని ఉన్నారు.