TSK

TSK · సంఖ్యా 21:6

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు.

దక్షిణ దేశంలో ఉన్న క్రూరమృగాలను గూర్చిన దైవ ప్రకటన. సింహాలూ, ఆడ సింహాలూ, రక్త పింజేరి పాములూ, ఎగిరే సర్పాలతో దేశం ప్రమాదకరంగా మారినా వాళ్ళు మాత్రం తమ ఆస్తిని గాడిదల వీపుల పైనా, తమ సంపదలను ఒంటెల మూపుల పైనా తరలిస్తూ ఉంటారు. తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి వాటిని తీసుకు వెళ్తారు.

¶ కర్మెలు పర్వత శిఖరాన వాళ్ళు దాక్కున్నా నేను వాళ్ళను వెతికి పట్టుకుంటాను. నా దృష్టికి కనబడకుండా వాళ్ళు సముద్రపు అడుగున దాక్కున్నా వాళ్ళను కాటేయడానికి నేను పాముకు ఆజ్ఞాపిస్తాను. అది వాళ్ళను కాటేస్తుంది.