TSK

TSK · సంఖ్యా 35:33

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఆ దేశం అపవిత్రమై పోయింది. గనక నేను దానిపై దాని దోష శిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది.

¶ “మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోని పొలంలో ఒకడు చచ్చి పడి ఉండడం మీరు చూస్తే, వాణ్ణి చంపిన వాడెవడో తెలియనప్పుడు

ఈ దోషం యోవాబు మీదా, అతని తండ్రి సంతానమంతటి మీదా నిలుస్తుంది గాక. యోవాబు సంతానంలో గాయాలు ఉన్నవారు, కుష్టురోగులు, ముసలివారు, కత్తి చేత హతమయ్యేవారు, తిండి లేనివారు తప్పక ఉంటారు గాక” అన్నాడు.

¶ అయినా, మనష్షే యెహోవాకు పుట్టించిన కోపం వల్ల ఆయన కోపాగ్ని ఇంకా చల్లారకుండా, యూదా మీద మండుతూనే ఉంది.

కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి, రాజ భవనం దగ్గరున్న గుర్రపు ద్వారం ప్రవేశస్థలానికి ఆమె వచ్చినప్పుడు ఆమెను అక్కడ చంపేశారు.

నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.

అయితే ఈ మాటలన్నీ చెప్పడానికి నిజంగా యెహోవా మీ దగ్గరికి నన్ను పంపాడు. కాబట్టి, మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీ మీదికీ ఈ పట్టణం మీదికీ దాని నివాసుల మీదికీ తెచ్చుకున్న వాళ్ళవుతారు. దీనిని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.”

¶ అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం. హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది. ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.

‹నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.›