TSK

TSK · సామెత 20:18

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఈ ప్రజలు నా ఆధీనం ఉంటేనా! నేను అబీమెలెకును కూలదోసే వాణ్ణి గదా! నేను అబీమెలెకుతో, ‘నీ సైన్యాన్ని బయలుదేరి రమ్మను’ అనేవాణ్ణి గదా!” అన్నాడు.

¶ “ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు చెప్పండి, మీరంతా ఇక్కడే ఉన్నారు. ఈ విషయం గూర్చి ఆలోచించి ఏమి చేయాలో చెప్పండి”

రెండో రోజున ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకున్నారు. మొదటి రోజు తాము నిలబడిన స్థానాల్లోనే తిరిగి నిలబడ్డారు.

అబ్నేరు కేక వేసి “కత్తి ఎప్పుడూ చంపుతూనే ఉండాలా? అది చివరకూ కీడుకే కారణం అవుతుందని నీకు తెలుసు గదా. మీ సోదరులను తరమడం ఆపమని నీ మనుషులకు చెప్పకుండా ఎంతకాలం ఉంటావు?” అని యోవాబుతో అన్నాడు.

యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం అన్నీ వట్టి మాటలే. నా మీద తిరుగుబాటు చెయ్యడానికి నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు?

¶ మార్గదర్శకులు లేకపోతే ప్రజలు నాశనం అవుతారు. సలహాలిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ప్రజలకు క్షేమకరం.

¶ వివేకం గల నాయకుడివై యుద్ధం చెయ్యి. ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉండడం భద్రత.

¶ ‹“అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా?›