భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి.
TSK
TSK · కీర్తన 49:1
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
జింక సెలయేళ్ల కోసం దాహం గొన్నట్టుగా దేవా, నా హృదయం నీ కోసం తపించిపోతోంది.
మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి.
నా ప్రజలారా, నా బోధను ఆలకించండి. నేను చెప్పే మాటలు వినండి.
ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు. “నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు.
¶ ప్రవక్త యిర్మీయా యూదా ప్రజలందరితో, యెరూషలేము నివాసులందరితో ఆ సందేశాన్ని ప్రకటించాడు.
¶ తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకూ ఇతర దేశాల ప్రజల్లో నా పేరును అంతా గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల్లో నా పేరుకు ధూప నైవేద్యాలు, పవిత్రమైన అర్పణలు అర్పిస్తారు. అన్య దేశాల ప్రజల్లో నా పేరును ఉన్నతంగా ఎంచుతారు. అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.
‹చెవులున్నవాడు విను గాక!”› అన్నాడు.
¶ దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే.
¶ ‹మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”›
¶ ‹మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట విను గాక. ఎవరైతే జయిస్తారో అతణ్ణి దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతే కాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతి మీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది గానీ ఇంకెవరికీ తెలియదు.”›